గురువారం 02 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:42

వారంలో చింతమడకకు గోదావరి

వారంలో చింతమడకకు గోదావరి

  • కాలంతో కాదు కాళేశ్వరంతోనే పని: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్‌: వ్యవసాయానికి ఇకపై కాలంతో పనిలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే పని ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వారం, పదిరోజుల్లో చింతమడక చెరువుకు, రెండురోజుల్లో మధిర గ్రామాలైన దమ్మచెరువు, అంకంపేటలోని పెద్దచెరువుకు గోదావరి జలాలు రానున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతువేదిక భవనానికి శనివారం మంత్రి శంకుస్థాపనచేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ హామీమేరకు 133 మంది లబ్ధిదారులకు రూ.9 కోట్ల 87 వేల విలువైన చెక్కులను కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డితో కలిసి అందజేశారు. ఇప్పటివరకు 1,270 మంది లబ్ధిదారులకు సాయమందించామని తెలిపారు. 

అనంతరం చింతమడక శివారులో మల్లన్నసాగర్‌ దుబ్బాక ప్రధాన కాలువను, తద్వారా నిండనున్న చెరువులను పరిశీలించారు. ఇర్కోడు, తోర్నాల గ్రామాల్లోని కాలువల వద్ద జలహారతి పట్టి, గంగమ్మతల్లికి పుష్పాభిషేకంచేశారు. మధిర గ్రామాలైన అంకంపేట, దమ్మచెరువులో ఇండ్ల నిర్మాణా లు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. మూడునెలల్లో కొత్త ఇండ్లు పంపిణీచేస్తామన్నారు.


logo