సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 02:10:25

రాయ్‌గఢ్‌-పుగలూరు

రాయ్‌గఢ్‌-పుగలూరు

  • 800 కేవీ లైన్‌ ప్రారంభం
  • 1500 మెగావాట్ల సరఫరా సామర్థ్యం
  • 1765 కిలోమీటర్ల పొడవైన లైను నిర్మాణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పశ్చిమ, దక్షిణాది ప్రాంతాల మధ్య 1500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరాచేసే రాయ్‌గఢ్‌-పుగలూరు (తమిళనాడు) హైవోల్టేజ్‌ డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ను పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ హెచ్‌వీడీసీ టెర్మినల్‌ స్టేషన్‌ నుంచి తమిళనాడులోని పుగలూరు హెచ్‌వీడీసీ టెర్మినల్‌ స్టేషన్‌ వరకు 800 కేవీ సామర్థ్యంతో ఉండే లైన్‌ను (పోల్‌ 1) పవర్‌గ్రిడ్‌ ప్రారంభించింది. 6000 మెగావాట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా పోల్‌-1 కింద 1500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేలా ఈ 800 కేవీ లైన్‌ను 1765 కిలోమీటర్ల పొడవున వేశారు. పశ్చిమ భారతంలో ఐపీపీ (ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను దక్షిణాది రాష్ర్టాలకు సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. మిగిలిఉన్న పనులనుకూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేస్తామని పవర్‌గ్రిడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.


logo