ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 02:24:09

కరోనా కట్టడికి శాయశక్తులా కృషి

కరోనా కట్టడికి శాయశక్తులా కృషి

  • ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: ట్విట్టర్‌లో మంత్రి  కేటీఆర్‌ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. ప్రజ లు కూడా సహకరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  ట్విట్టర్‌లో సూచించారు. ‘ప్రజలు సామాజిక దూరం పాటించాలి. స్వీయ పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే వైద్యసాయం కోసం 104కు ఫోన్‌ చేయాలి. అనవసర ప్రయాణాలను దూరం పెట్టాలి. సామాజిక మాధ్యమాల్లో వదంతులు నమ్మవద్దు’ అని  కేటీఆర్‌ సూచించారు. మన దేశంలో కరోనా మహమ్మారిని నివారించడంలో కీలక దశకు చేరుకొన్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కృషిచేస్తున్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడిక్స్‌, ఆరోగ్య సం రక్షణ సిబ్బందిని అభినందించారు.


logo