ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 05, 2021 , 02:22:04

9 నుంచి వండర్‌లా హాలీడే

9 నుంచి వండర్‌లా హాలీడే

హైదరాబాద్‌, జనవరి 4: హైదరాబాద్‌లో వండర్‌లా హాలీడే ఏర్పాటు చేసిన అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ తిరిగి ప్రారంభంకాబోతున్నది. కరోనా కారణంగా గతేడాది మూతపడిన ఈ పార్క్‌ ఈ నెల 9 నుంచి తిరిగి అందుబాటులోకి  తీసుకొస్తున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా కరోనా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకోసం ఈ నెల 7,8 తేదిల్లో ఉచితంగా పార్క్‌ను సందర్శించే అవకాశం కల్పించింది. ఇందుకోసం 5 వేల మంది కోవిడ్‌-19 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అవకాశం కల్పించింది. వీరికి అన్ని రైడ్లతోపాటు ఉచిత భోజనం, టీ, స్నాక్స్‌ అందిస్తుండటం విశేషం. వీరిలో డాక్టర్లు, నర్స్‌ లు, అంబులెన్స్‌ డ్రైవర్లు, పోలీసులు, బ్యాంకర్లు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌, టీచర్లు, జర్నలిస్ట్‌లు ఉన్నారు. సాధారణ ప్రజలకు ఈ నెల 9 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్టు ధరను  రూ.699గా నిర్ణయించింది.  

VIDEOS

logo