సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 19:40:00

భర్తను గొంతుకోసి చంపిన భార్య

భర్తను గొంతుకోసి చంపిన భార్య

వనపర్తి: అనుమానంతో నిత్యం వేదిస్తున్న భర్తను దారుణంగా హత్య చేసిన భార్య ఉదంతం వనపర్తి జిల్లా పెద్దమందండి మండలం స్కూల్‌ తండాలో చోటు చేసుకుంది. స్కూల్‌ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్యాతండాకు చెందిన మెగావత్‌ బాల్య నాయక్‌, భార్య మణెమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండగా లాక్‌డౌన్‌తో పనిలేక దంపతులిద్దరూ సొంత తండాకు తిరిగి వచ్చారు. భార్యపై నిత్యం అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా విసుగు చెందిన భార్య మణెమ్మ మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భర్త బాల్య నాయక్‌ గొంతు కోసి హత్య చేసిందని ఎస్సై రాము తెలిపారు. హత్యలో కూతురు ప్రమేయం కూడా ఉందని ఆయన వివరించారు. . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


logo