మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 01:30:10

మహిళా దినోత్సవ నిర్వహణ కమిటీ

మహిళా దినోత్సవ నిర్వహణ కమిటీ
  • చైర్మన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. వైస్‌చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఉండే కమిటీలో సభ్యులుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అరుణా బహుగుణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టియానా ఛోంగ్తు, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, ది హిందూ దినపత్రిక డిప్యూటీ రెసిడెంట్‌ ఎడిటర్‌ చింతల ప్రశాంత్‌రెడ్డి, జేఎన్‌ఎఫ్‌ఏయూ వీసీ కవితాదర్యారీరావు, ఆర్టిస్ట్‌ సురభివాణి, తెలుగు విశ్వవిద్యాలయం డ్యాన్స్‌ టీచింగ్‌ అసిస్టెంట్‌ కే సువర్చల, ఉర్దూ కవయిత్రి తస్నీం జౌహర్‌, సభ్య కార్యదర్శిగా మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య, సభ్య కన్వీనర్‌గా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఉంటారు. 


logo
>>>>>>