శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 07:09:56

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నేడు మహిళా దినోత్సవం

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నేడు మహిళా దినోత్సవం

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని సర్కిళ్లలో వేడుకలు నిర్వహించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రకటన చేసింది. అన్ని సర్కిళ్లలో మహిళా దినోత్సవం నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం 10 గంటలకు అన్ని సర్కిళ్లలో వేడుకల నిర్వహణ జరగనుంది. జీహెచ్‌ఎంసీ మహిళా, పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలని వెల్లడించారు. అదేవిధంగా ఉత్తమ పారిశుద్ధ్య మహిళా ఉద్యోగిని సత్కరించాలని పేర్కొన్నారు. వేడుకలకు ప్రతి ఉద్యోగిని, పారిశుద్ధ్య సిబ్బంది హాజరయ్యేలా చూడాలని కమిషనర్‌ సూచించారు.


logo