మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:07

ఆన్‌లైన్‌లో మీరు ఎంత భద్రం!

ఆన్‌లైన్‌లో మీరు ఎంత భద్రం!

  • ఏ రకాల సైబర్‌నేరాలపై అవగాహన ఉన్నది?
  • సైబ్‌హర్‌లో ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబ్‌హర్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించింది. ఇందులో పాఠశాలల, కళాశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యార్థులు సుమారు మూడువేల మంది పాల్గొన్నట్టు ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో మీరు ఎంత భద్రంగా ఉన్నారు? ఏ రకాల సైబర్‌నేరాలపై అవగాహన ఉన్నది? ఇలా మొత్తం 15 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు ఇచ్చినవారికి తెలంగాణ పోలీస్‌ తరపున డిజిటల్‌ సర్టిఫికెట్లను జారీ చేశారు. సైబ్‌హర్‌ ప్రచారంలో గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా నాలుగువేల మంది పౌరులు రిజిస్టర్‌ అయినట్టు డీఐజీ సుమతి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు www.cybeher.com వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. logo