సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 17:53:28

నాలుగు నెల‌ల్లో మ‌హిళా బృందం 30 వేల మాస్కుల త‌యారీ

నాలుగు నెల‌ల్లో మ‌హిళా బృందం 30 వేల మాస్కుల త‌యారీ

హైద‌రాబాద్ : జీఎంఆర్ వ‌ర‌ల‌క్ష్మి ఫౌండేష‌న్‌(జీఎంఆర్‌వీఎఫ్‌) హైద‌రాబాద్ కేంద్రానికి చెందిన మ‌హిళ‌లు కోవిడ్ సంక్షోభంలో త‌మ వంతూ చేయూత‌ను అందిస్తున్నారు. 14 మ‌హిళ‌ల బృందం గ‌త నాలుగు నెలల్లో 30 వేల మాస్కులు, 6 వేల పీపీఈ కిట్ల‌ను త‌యారు చేసింది. మ‌రోవైపు ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వారి కుటుంబాల‌కు కొంత ఆదాయాన్ని సంపాదించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. సీఈవో ప్ర‌దీప్ పానిక‌ర్ మాట్లాడుతూ... కోవిడ్ వారియ‌ర్స్‌కు పీపీఈ కిట్లు అందించ‌డంలో జీఎంఆర్‌వీఎఫ్‌కు చెందిన నైపుణ్యం గ‌ల మ‌హిళ‌లు ప‌నిచేస్తుండ‌టం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.

ఓ సంస్థ‌గా సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేర్చుతున్న‌ట్లు తెలిపారు. ఈ కీలకమైన సమయంలో మ‌హిళా సాధికార‌త‌కు కృషి చేస్తూనే ప్రజలకు చాలా అవసరమైనప్పుడు సహాయం చేస్తున్నందుకు త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు. పీపీఈ కిట్ల కోసం ఫార్మా ఏజెన్సీల నుండి త‌మ‌కు ఎక్కువ‌గా ఆర్డ‌ర్లు అందుతున్న‌ట్లు చెప్పారు. హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో సైతం జీఎంఆర్‌వీఎఫ్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.


logo