శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 13:28:32

పోలీసుల ఎదుట మహిళా మావోయిస్టు లొంగుబాటు

పోలీసుల ఎదుట మహిళా మావోయిస్టు లొంగుబాటు

భద్రాచలం : భద్రాచలం పోలీసుల ఎదుట మహిళా మావోయిస్టు గురువారం లొంగిపోయింది. ఐదేళ్లుగా మావోయిస్టు దళంలో పని చేస్తున్న కలుమాదేవి అనే మావోయిస్టు జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. ఈ సందర్భంగా మీడియాకు ఏఎస్పీ రాజేశ్‌ చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. కలుమాదేవి 2014లో సీపీఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రకాశ్‌ ఏరియా కమిటీలో చేరింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది. 2016 నుంచి 17 వరకు మావోయిస్టు చర్ల నాయకత్వంలో గార్డుగా పని చేసింది.  2017 నుంచి 2019 వరకు శబరి కమాండర్‌గా కొనసాగింది. 2019-20 మధ్య కొంతకాలం శబరీ ఐసీ కమాండర్‌గా పని చేసింది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక, పార్టీలో పని చేయడానికి ఆసక్తి లేక జనజీవన స్రవంతిలో కలవాలని పార్టీ నుంచి బయటకు వచ్చింది. లొంగిపోయినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రివార్డును కలుమాదేవికి ఇప్పిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.