ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:49:13

అనుమానిస్తున్నాడని అడవిలో పూడ్చేసింది!

అనుమానిస్తున్నాడని  అడవిలో పూడ్చేసింది!

తల్లిదండ్రులతో కలిసి భర్తను చంపిన భార్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం

భూపాలపల్లి టౌన్‌, జనవరి 22: ఏడేండ్ల కిందట మూడుముళ్లు ఏడడుగులతో ఒక్కటయ్యారు. పిల్లాపాపలతో అన్యోన్యంగా జీవించారు. కా నీ.. అనుమానం పెనుభూతమై భార్య ను వేధించడం మొదలుపెట్టాడు. తర చూ ఘర్షణకు దిగాడు. వేధింపులు తా ళలేక భార్య.. తల్లిదండ్రులు, అన్నతో కలిసి భర్తను హతమార్చింది.. అడవిలో పూడ్చేసింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి చెందిన కాళేశ్వరపు రమేశ్‌ (38)కు నేరేడుపల్లికి చెందిన శారదకు ఏడేండ్ల కిందట వివాహమైం ది. కొంతకాలం బాగానే ఉన్నా.. ఆ త ర్వాత శారదను రమేశ్‌ అనుమానిస్తూ వేధించేవాడు. గత ఏడాది డిసెంబర్‌ 1న శుభకార్యం కోసం శారద పిల్లలతో కలిసి రమేశ్‌ నేరేడుపల్లిలోని అత్తవారింటికి వచ్చాడు. మరుసటి రోజున అక్కడే భార్యతో గొడవ జరిగింది. తరుచూ అనుమానంతో వేధిస్తున్నాడని, రమేశ్‌ను చంపాలని శారద.. అన్న మల్లయ్య అలియాస్‌ మధు, తండ్రి సాంబమూర్తి, తల్లి లక్ష్మితో కలిసి నిర్ణయించింది. సాయంత్రం గడ్డి మందు కలిపి ఇచ్చిన మద్యం తాగి రమేశ్‌ చనిపోయాడు. అదే రాత్రి మృతదేహాన్ని ఎడ్లబండిలో గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లి పూడ్చి పెట్టారు. అదేనెల 4న తన సోదరుడు కనిపించడం లేదని.. వదిన, అత్తామామలపై అనుమానం ఉన్నదని రమేశ్‌ సోదరి భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో రమేశ్‌ను హతమార్చినట్టు శారద అంగీకరించింది. శుక్రవారం పోలీసులు రమేశ్‌ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. లక్ష్మి పరారీలో ఉండగా, మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

VIDEOS

logo