గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 07:40:49

మహిళా కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి..

మహిళా కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి..

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం.. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యవేదిక హైదరాబాద్‌ జిల్లా అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ హాజరై, ప్రసంగించారు. మహిళలపై దాడులు అరికట్టాలని, ప్రత్యేక మహిళా కమిషన్‌ ఏర్పాటు చేసి చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ రాములు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య,  బీసీ సంఘం నాయకుడు కోలా జనార్దన్‌, జేరిపోతుల లత, మట్ట జయంత్‌ గౌడ్‌, రజి హైదర్‌ ఖాన్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.


logo