ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 18:03:30

ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు ఇక గులాబీ రంగులో..

 ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు ఇక గులాబీ రంగులో..

 ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు ఇక గులాబీ రంగులోనే.. 

ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు గులాబీ రంగులోనే ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బస్సుల రంగు మార్చామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా బస్సులను బుధవారం ఎస్సాఆర్ అండ్ బీజీఎన్నార్ కళాశాల మైదానంలో అందుబాటులో ఉంచారు. 

మంత్రి కేటీఆర్ సూచనలతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బయో-టాయిలెట్ బస్సులు  యూనిఫార్మల్ గా గులాబీ రంగులోనే ఉండనున్నాయని మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్  ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ఉన్నారు.


logo