సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:10

వీఆర్వోపై మహిళల దాడి

వీఆర్వోపై మహిళల దాడి

తాంసి: భూమిని ఇతరుల పేరిట మార్చాడని ఓ వీఆర్వోపై మహిళలు దాడికి దిగిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తాంసిలో చోటుచేసుకున్నది. మండలంలోని వడ్డాడికి చెందిన రైతు జంగ చినగంగారెడ్డి, పొన్నారి గ్రామానికి చెందిన తొకల పెదస్వామికి చెందిన భూముల్లో కొంత భూమిని రోహిత్‌ ఇతరుల పేరిట మార్చాడు. రైతులిద్దరూ పత్తి పంటను అమ్మడానికి ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లగా, వారి పేరిట భూమి లేదని సిబ్బంది స్పష్టంచేశారు. బాధితులు తాంసి తహసిల్‌ కార్యాలయానికి వెళ్లగా వీఆర్వో రోహిత్‌ కనపడగానే ఇద్దరు రైతులు, మహిళలు చెప్పులతో దాడికి దిగారు. తాసిల్దార్‌ను వివరణ కోరగా భూ సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.