శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 22:04:08

అన్ని రంగాలలో మహిళలు ముందుకెళ్తున్నారు

అన్ని రంగాలలో మహిళలు ముందుకెళ్తున్నారు

సొంతగా వ్యాపారం చేసేందుకు మెట్రోనగరాల్లో ఉండే మహిళల కంటే ద్వితీయ శ్రేణినగరాల్లోని మహిళలే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఔత్సాహికులుగా రాణించేందుకు అవసరమైన రుణాలను సమకూర్చుకునేందుకు కూడా వీరే ముందుంటున్నారట. మహిళలు ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అంశంపై ఓ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఇందులో 25 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వయసు కలిగిన 8,500 మంది మహిళలు పాల్గొన్నారు. మెట్రో నగరాల్లో ఉండేవారితోపాటు, ద్వితీయశ్రేణి పట్టణాలకు చెందిన మహిళల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. 

 • ద్వితీయ శ్రేణి నగరాలకు చెందిన వారితో పోలిస్తే మెట్రోనగరాలకు చెందిన మహిళలే ఆరోగ్యంపై ఎక్కువగా శ్రధ్ధ కనబరుస్తున్నారు. 
 • మెట్రో నగరాల్లోని మహిళలు తమ సంపాదనలో జీవనశైలి, ప్రయాణఖర్చులకు అధికంగా డబ్బు వెచ్చిస్తుండగా. 
 • ద్వితీయశ్రేణి నగరాలకు చెందిన వారు ఇంటి అవసరాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 
 • పట్టణేతర ప్రాంతాల్లో 28 శాతంమంది మహిళలు ఆర్థిక మార్గదర్శకత్వంపై తమ జీవితభాగస్వాములపై ఆధారపడుతున్నారు. 
 • నగరాల్లో 19 శాతం మంది మాత్రమే ఆర్థిక విషయాల్లో తమ భర్తల సలహాలు తీసుకొంటున్నారు. 
 • మెట్రో నగరాల్లోని మహిళలు 66 శాతంమంది సొంతగా ఆర్థిక నిర్ణయాలు తీసుకొంటున్నారు. ద్వితీయశ్రేణి నగరాల్లో అయితే కేవలం 48 శాతం మందే. 
 • 28 శాతంమంది ఉద్యోగినులు 45 నుంచి 50 శాతం జీతాన్ని పెట్టుబడులకు వినియోగిస్తుండగా, ఇంట్లో మార్పు చేర్పులకు, నూతన వస్తువుల కొనుగోలు కోసం 58 శాతం మంది మహిళలు తమ క్రిడిట్‌ స్కోర్‌ తెలుసుకుంటున్నారు. 
 • రుణాలతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు
 • మెట్రోనగరాలకు చెందిన వారు 20 శాతం పెండ్లి రుణాలకు ధరఖాస్తు చేస్తుండగా. పట్టణేతర ప్రాంతాలకు చెందిన వారు 13 శాతం మాత్రమే రుణాలు తీసుకుంటున్నారు. 
 • వ్యాపారాల కోసం పట్టణాల్లో 12, ఇతర ప్రాంతాల్లో 22 శాతం మంది రుణాలు సమకూర్చుకుంటున్నారు. 
 • విద్యావసరాల కోసం పట్టణాల్లో 8 శాతం, ద్వితీయ శ్రేణి నగరాల్లో 10 శాతం రుణాలు పొందుతున్నారు. 
 • ఇంటిలో మార్పు చేర్పుల కోసం 22శాతం రుణాలు తీసుకొంటున్నారు. అదే ఇతర ప్రాంతాల్లో 20 శాతం మంది మాత్రమే అందుకోసం రుణాలపై ఆధారపడుతున్నారు. 
 • ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు నగరవాసుల కంటే ద్వితీయశ్రేణి నగరాల వారే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. 
 • ఫుడ్‌, ఎంటైర్టెన్మెంట్‌ అంశాల్లో 19శాతం ఖర్చు చేస్తూ మెట్రో నగరాలకు చెందిన వారు ముందున్నారు. 
 • వివిధ రంగాల్లో నైపుణ్యత పెంచుకోవడం కోసం పట్టణాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. 


logo