మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Aug 08, 2020 , 01:45:39

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శరణ్య బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కామారెడ్డికి చెందిన శరణ్య (25), రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లయిన కొన్ని రోజుల నుంచి రోహిత్‌ నిత్యం మద్యం సేవిస్తూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. శారీరకంగా నరకం చూపించేవాడు. దీం తో కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిగారింటికి వచ్చేసింది. శరణ్యను బాగా చూసుకుంటానని రోహిత్‌ పెద్దల సమక్షంలో ఒప్పుకొని బెంగళూరు తీసుకెళ్లాడు. శుక్రవారం శరణ్య తాము ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే బెంగళూరుకు బయలుదేరారు. తమ కూతురిని రోహిత్‌ హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.logo