గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 02:04:21

అంతిమయాత్ర లేకుండానే..

అంతిమయాత్ర లేకుండానే..

  • అనారోగ్యంతో బాలుడి మృతి
  • రిక్షాపై శ్మశానవాటికకు మృతదేహం
  • కరోనా కష్టాల నడుమ అంత్యక్రియలు
  • భద్రాచలంలో కలిచివేసిన ఘటన 

భద్రాచలం: కరోనా కఠిన పరీక్ష పెట్టింది. అనారోగ్యంతో తనువు చాలించిన కొడుకుకు అంతిమయాత్ర లేకుండానే శ్మశానానికి తరలించాల్సి వచ్చింది ఆ తల్లిదండ్రులు. అయినవారు కూడా దూరంగా ఉండటంతో రిక్షాలోనే మృతదేహాన్ని తీసుకెళ్లిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం చోటుచేసుకున్నది. భద్రాచలంలోని ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఎస్కే మూర్తుజా వలి, ఫరీదా దంపతులు. వీరు పట్టణంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సాధిక్‌ (13) రెండేండ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్దిమంది బంధువులు మాత్రమే కడచూపునకు వచ్చారు. సోమవారం ఉదయం బాలుడి మృతదేహాన్ని అతడి తాత తన రిక్షాలో శ్మశాన వాటికకు తీసుకెళ్లాడు. కుమారుడు ఎడబాసిపోయాడనే బాధ కన్నా మరుభూమికి తరలించిన తీరు వారిని కుంగదీసింది.


logo