సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 10:28:26

మహిళ హత్య... క్షుద్రపూజలని అనుమానం...

మహిళ హత్య... క్షుద్రపూజలని అనుమానం...

నిజామాబాద్ ‌: జిల్లాలోని ఆర్యనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మీ అనే గృహిణిని గుర్తు తెలియని దుండగులు కాలి మట్టెలు ఉన్న వేళ్లు నరికి, గొంతుకోసి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నిన్న పగలు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి ఐదు తులాల బంగారం, రూ.10వేలు నగదు చోరీకి గురి అయ్యాయి. మట్టెలున్న కాలివేళ్లు నరకడం, శవం వద్ద పసుపు, కారం, నిమ్మకాయలు, పువ్వులు, తోరణాలు కట్టి ఉన్నాయి. దీంతో క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలు వరలక్ష్మీ, భర్త శ్రీనివాస్‌ల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఇంట్లో కుక్క ఉన్న చప్పుడు చేయకపోవడాన్ని చూస్తే తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo