బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Feb 24, 2020 , 20:36:10

ట్రాక్టర్‌ ఢీకొని వంట మనిషి మృతి

ట్రాక్టర్‌ ఢీకొని వంట మనిషి మృతి

మధిర ‌: ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురం పాఠశాలలోకి ట్రాక్టర్‌ దూసుకవచ్చిన ఘటనలో మధ్యాహ్న భోజనం వండే మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామచంద్రాపురం గ్రామానికి చెందిన డ్రైవర్‌ పంతంగి నరసింహారావు మధ్యాహ్న సమయంలో అతిగా మద్యంతాగి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వస్తూ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న పాఠశాలలోకి దూసుకెళ్లాడు. మధ్యాహ్న భోజనం వండే మనిషి జానుపాటి లక్ష్మీ(50) విద్యార్థులకు భోజనం వడ్డించి పాత్రలు శుభ్రం చేస్తుండగా ఆమెను ట్రాక్టర్‌తో తొక్కించి పాఠశాల తరగతి గదిని ఢీకొన్నాడు. ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మధ్యాహ్న సమయం కావడంతో విద్యార్థులు ఆరుబయట ఉండటంతో పెనుప్రమాదం తప్పినైట్లెంది.