ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 20:47:33

అక్క కూతురును బంధించి చిత్రహింసలకు గురిచేసిన చిన్నమ్మ

 అక్క కూతురును బంధించి చిత్రహింసలకు గురిచేసిన చిన్నమ్మ

నల్లగొండ : మైనర్ బాలికను ఆమె చిన్నమ్మే గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలివి.. పట్టణానికి చెందిన మంగమ్మ పద్నాలుగేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది. మంగమ్మ కు ఆమె చెల్లెలు కల్యాణికి మధ్య కొంతకాలంగా భూమితోపాటు అప్పు చెల్లింపు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న అక్క మంగమ్మ కుమార్తెను కల్యాణి బట్టలు కొనిస్తానని చెప్పి టాకారోడ్డుకు తీసుకెళ్లింది.

అక్కడ మరో వ్యక్తితో కలిసి గదికి బంధించింది. బాలిక కేకలు వేయకుండా నోట్లో రుమాళ్లు కుక్కారు. మూడ్రోజుల పాటు ఇక్కడి బంధించి  అనంతరం బైక్‌పై నల్గొండ రైల్వే స్టేషన్​వద్దకు తీసుకెళ్లి మరో గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు. 11 రోజుల పాటు నిర్భంధించి మంగళవారం అర్ధరాత్రి తీసుకొచ్చి బాలిక నివాసానికి సమీపంలో ఆమెను వదిలేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఈ నెల 8న వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు బాలిక తీసుకొచ్చి వదిలేశారు. బాలిక వాంగ్మూలం నమోదు చేశామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్​పోలీసులు చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.