సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:25:31

ఈ మహిళకు కుడివైపు గుండె

ఈ మహిళకు కుడివైపు గుండె

వైరా, నమస్తే తెలంగాణ: సాధారణంగా మ ను షుల్లో గుండె ఛాతికి ఎడమవైపున ఉం టుంది. కానీ, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఓ మహిళకు కుడివైపున ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. పట్టణానికి చెందిన బాసాటి ఉష(22)కు ఆనంద్‌తో పదేండ్ల కింద పెండ్లి అయ్యింది. వీరికి సంతానం లేకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో సంప్రదించారు. ఉషను పరిశీలించిన డాక్టర్‌ ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్టు గుర్తించారు. వేల మందిలో ఒకరికి ఈవిధంగా గుండె కుడివైపు ఉం టుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలోని ప్రముఖవైద్యుడు డాక్టర్‌ దారెల్లి కోటయ్య చెప్పారు.


logo