సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 20:46:56

మహిళకు కుడివైపున గుండె

మహిళకు కుడివైపున గుండె

వైరా  : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఓ వివాహితకు కుడివైపు గుండె ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సంతాన నిమిత్తం వైద్య పరీక్షల కోసం వెళ్లిన సమయంలో ఈ విషయం బయటపడింది. 3వ వార్డులోని బాసాటి ఉష(22)కు ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్లు తేలింది. ఇదే వార్డుకు చెందిన బాసాటి ఆనంద్‌తో ఉషకు పదేళ్ల క్రితం వివాహం కాగా ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిని సంప్రదించారు. 

ఉషను పరిశీలించిన వైద్యురాలు ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్లు అనుమానం రావడంతో స్కానింగ్‌ తీయించారు. దీంతో వైద్యురాలి అనుమానమే నిజమైంది. ఉషకు కుడివైపు గుండె ఉన్నట్లు తేలింది. వేలాది మందిలో ఒకరికి ఈ విధంగా గుండె కుడివైపు ఉండటం సహజమని, దీనివలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, అందువలన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ దారెల్లి కోటయ్య స్పష్టం చేశారు. logo