శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 14:41:34

దోషం ఉంద‌ని పూజ‌లు.. తాళి క‌ట్టిన జ్యోతిషుడు

దోషం ఉంద‌ని పూజ‌లు.. తాళి క‌ట్టిన జ్యోతిషుడు

హైద‌రాబాద్ : కేపీహెచ్‌బీ కాల‌నీలో న‌కిలీ జ్యోతిషుడి మోసం బ‌య‌ట‌ప‌డింది. దోషం ఉంద‌ని, పూజ‌లు చేయాల‌ని ఓ మ‌హిళ‌ను జ్యోతిషుడు భ‌య‌పెట్టాడు. పూజ‌లు చేయ‌కుంటే భ‌ర్త చ‌నిపోతాడ‌ని జ్యోతిషుడు కోసూరి మాధ‌వ్ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. భ‌ర్త లేని స‌మ‌యంలో జ్యోతిషుడు ఆమె ఇంట్లో పూజ‌లు చేశాడు. పూజ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆమె మెడ‌లో తాళి క‌ట్టి ఫోటోలు తీశాడు. ఆ ఫోటోల‌ను చూపించి మ‌హిళ‌ను వేధిస్తున్నాడు. దీంతో అతనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాధ‌వ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. 


logo