హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి కిందపడి పోవడంతో ఓ మహిళ గాయపడింది. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి పక్కనే ఉన్న లేక్ వ్యూ పార్కులోకి మహిళ పడిపోయిందన్నారు. దీంతో ఆమెకు గాయాలైనట్లు తెలిపారు. ఇది గమనించిన కొంతమంది బాటసారులు 108 అంబులెన్స్ కాల్ చేసి సమాచారం ఇచ్చారు. సిబ్బందికి సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ అపస్మారక స్థితిలో కిందపడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.