శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 12:29:35

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు...

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు...

మహబూబాద్‌: కొండపల్లి నుంచి మహబూబాద్‌కు  గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గార్ల రైల్వేస్టేషన్‌లో దిగిపోవాల్సి వచ్చింది. రైల్లోనే ఆమెకు పురిటినొప్పులు రావడంతో  ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్‌ మాస్టర్‌ వెంటనే 108కి ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు.   డాక్టర్‌తో సహా వైద్య సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మహిళకు వైద్యం అందించారు. రైల్వే స్టేషన్‌లోనే గర్బిణీకి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పురుడు పోశారు. శైలజ మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. 108 వాహనంలో మహబూబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. logo