మంగళవారం 02 జూన్ 2020
Telangana - May 12, 2020 , 17:13:01

కరోనా కాలంలో.. మహిళా కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో కీలకం

కరోనా కాలంలో.. మహిళా కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో కీలకం

హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో కరోనా ఉమెన్‌ వారియర్స్‌ వీడియోను సీపీ అంజనీ కుమార్‌ ఆవిష్కరించారు. పలువురు మహిళా కానిస్టేబుళ్లను మొమెంటోలతో సీపీ సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలను విజయవంతం చేశామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో మహిళా పోలీసులు నిరంతరం డ్యూటీ చేస్తున్నారని కొనియాడారు. ఐసోలేషన్‌, క్వారంటైన్లలో మహిళా కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో అవసరమని చెప్పారు. కొన్ని పోలీసు స్టేషన్లలో కేవలం ఒక్కరు మాత్రమే ఉంటే.. మిగతా వారందరూ లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్నారని సీపీ తెలిపారు.


logo