శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 15:04:13

బడపహాడ్‌లో మహిళ దారుణ హత్య

బడపహాడ్‌లో మహిళ దారుణ హత్య

నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వర్ని మండలం బడపహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ముఖాన్ని గుర్తు పట్టకుండా ఛిద్రం చేసిన దుండగులు మృతదేహాన్ని ఓ చిన్న కాలువలో  పడేశారు. హత్య గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మహిళా ఎవరు? అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo