శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 08:38:28

నంబర్‌ ప్లేటు సరిగ్గా లేకుంటే ఫొటో పంపండి..

నంబర్‌ ప్లేటు సరిగ్గా లేకుంటే ఫొటో పంపండి..

హైదరాబాద్ : వాహన నంబర్‌ ప్లేటు సరిగ్గా లేకపోతే ఆ వాహనదారుడిని చైన్‌ స్నాచర్‌గా అనుమానిస్తామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌  ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  హైదరాబాద్‌ పోలీసుల వద్ద నంబర్‌ ప్లేట్లను సరిగ్గా అమర్చకుండా.. తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాల రికార్డులు ఉన్నాయన్నారు. మంగళవారం సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని సీపీ వివరించారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి హైదరాబాద్‌ వాట్సాప్‌ 9490616555కు పంపాలని నగర పౌరులను సీపీ ట్విట్టర్‌లో కోరారు. 


logo