శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 13:27:58

సీతారామ ప్రాజెక్ట్ తో మహబూబాబాద్ ను కోనసీమగా మారుస్తా

సీతారామ ప్రాజెక్ట్ తో మహబూబాబాద్ ను కోనసీమగా మారుస్తా

మహబూబాబాద్ : సీతారామ ప్రాజెక్టు నీటితో జిల్లాను కోనసీమగా మారుస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మరిపెడ మండలం కేంద్రంలో మున్సిపల్ పార్క్ లో ఆరో విడత హరితహారం పురస్కరించుకొని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యా నాయక్ తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు తో ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందడం రైతుల జీవితాల్లో వెలుగులు నింపినట్లు అయిందన్నారు.


అదేవిధంగా జిల్లాలో ప్రవహిస్తున్న నాలుగు నదులు పాలేరు, ఆకేరు, మున్నేరు, అలిగేరు నీటితో పాలేరు రిజర్వాయర్ కు చేరుతుందని, పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసి రైతులు రెండు పంటలు పండించుకునే విధంగా కృషి చేస్తానన్నారు. రైతులు ఒకే పంట వేసి రేటు లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు 82 వేదికలు చేపట్టామని తెలిపారు.logo