గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 15:32:15

ప్రకృతి వనాలతో.. పరిపూర్ణ ఆరోగ్యం

 ప్రకృతి వనాలతో.. పరిపూర్ణ ఆరోగ్యం

ఆదిలాబాద్ : ప్రకృతి వనాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నాం. ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిండంలో ఈ ప్రకృతి వనాలు ముఖ్య భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో రూ.3.74 లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనానికి  భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు హరితహారం లో భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరు హరిత సైనికునిల్లా పని చేయలన్నారు. 

అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మిస్తుందని, ఈ వేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి, రైతులకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న జట్పీటీసీ నల్లా వనిత, ఎంపీపీ చందాల  ఈశ్వరీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లద్, తదితరులు పాల్గొన్నారుlogo