శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 01:11:10

సృష్టికి మూలం అమ్మ

సృష్టికి మూలం అమ్మ

  • మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః సృష్టికి మూలం అమ్మ అని, మహిళకు జీవితంలో అమ్మతనాన్ని మించిన సంతోషం ఏదీ లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆడపిల్ల అమ్మ గర్బంలో పడినప్పటి నుంచి పెండ్లి చేసుకొని మళ్లీ మాతృత్వాన్ని పొందేవరకు ఈ పథకాలు అండగా నిలుస్తున్నాయన్నారు. అమ్మ ఒడి పథకం, కేసీఆర్‌ కిట్లు, ఆడపిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్స్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం షీటీమ్స్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్స్‌, భరోసా కేంద్రాలు, సఖి కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 


logo