బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 20:51:18

గవర్నర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్‌

గవర్నర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర తొలి మహిళా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర తొలి మహిళగా ఈ రాష్ట్ర మహిళల సంక్షేమంలో గవర్నర్‌ మాకు మంచి తోడుగా నిలుస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గవర్నర్‌కు గిరిజనుల పట్ల అపారమైన ఇష్టం ఉందని, కేంద్రం నుంచి ఈ రాష్ట్ర గిరిజనులకు మరింత మేలు జరిగేలా ఆమె కృషి చేయాలని ఆకాంక్షించారు.

తాజావార్తలు


logo