బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 09:30:47

ఇవాళ్టి నుంచి వింగ్స్ ఇండియా షో

ఇవాళ్టి నుంచి వింగ్స్ ఇండియా షో

హైదరాబాద్‌: రెండేండ్లకోసారి నిర్వహించే వింగ్స్‌ ఇండియా ఎయిర్‌షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట విమానాశ్రయంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది.  పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇం డియా-2020 ప్రదర్శనను 13వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు అదేరోజు రాత్రి తాజ్‌కృష్ణ హోటల్‌లో అవార్డులు అందజేయనున్నారు. 

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్‌షోలు నిర్వహించనున్నారు. కొవిడ్‌-19 వ్యాపించకుండా పౌరవిమానయానశాఖ, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్నాయి. ప్రదర్శనకు వీలైనంత తక్కువ సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరయ్యేలా చూస్తున్నారు. ఈసారి  ప్రజలను ఎయిర్‌షోకు అనుమతించడంలేదు. సదస్సు లు జరిగే ప్రదేశాల్లో ప్రతినిధులు కూర్చొనే దూ రాన్ని పెంచేలాచర్యలు తీసుకొంటున్నారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు హాజరవుతున్నందున.. వారిని పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు  ఇక్కడున్న వనరులు, పారిశ్రామిక విధానం, తదితరాలను వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


logo