e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News Wine shops Reservations‌ | సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

Wine shops Reservations‌ | సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

మహబూబ్‌నగర్‌ : వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గౌడ కులస్థులకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి జిల్లా గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.

కాగా, సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దళితబంధు అమలులో భాగంగా వైన్స్‌ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement