బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 18:27:20

గోడకు కన్నం వేసి మద్యం షాపు లూటీ.. వీడియో

గోడకు కన్నం వేసి మద్యం షాపు లూటీ.. వీడియో

హైదరాబాద్‌ : అసలే లాక్‌డౌన్‌.. బయట ఎక్కడా మందు దొరకట్లేదు. మద్యం ప్రియులకు నాలుక పీక్కుపోతుంది. మందు లేక పిచ్చెక్కుతుంది. దీన్ని క్యాష్‌ చేసుకోవాలనుకున్నారో ఏమో కొందరు ఏకంగా మద్యం షాపుకే కన్నం వేశారు. చేతికందిన కాడికి మద్యం బాటిళ్లు దోచుకెళ్లారు. 

 హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీవెంకటేశ్వర వైన్స్‌ దుకాణంలో రాత్రి దొంగలు పడ్డారు. మొత్తం లూటీ చేశారు. దుకాణం వెనుక నుంచి గోడకు రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. రూ. లక్ష విలువైన మద్యం బాటిళ్లను దోచుకుని జంప్‌ అయ్యారు. ఇదంతా సీన్‌ బై సీన్‌ సీసీ టీవీలో రికార్డయింది. ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేడీగాళ్లను దొరకబట్టడంలో నిమగ్నమయ్యారు.  గోడకు కన్నం వేసి మద్యం షాపు లూటీ.. వీడియో మీకోసం..logo