బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 18:52:41

గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా

గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా

హైదరాబాద్‌ : జీవనోపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం గల్ఫ్ వలస కార్మిక సంఘాల ప్రతినిధులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారి సమస్యలు తనకు క్షుణ్ణంగా తెలుసన్నారు.

గల్ఫ్ దేశాల్లో వారు పడుతున్న ఇబ్బందులు కూడా తెలుసు అని తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ లో మృతి చెందిన వారి భౌతికకాయాన్ని ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తరలించాలనీ, విదేశీ జైలులో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందించాలని,  ప్రవాసులకు బీమా సౌకర్యం కల్పించాలని, స్వదేశానికి తిరిగి వచ్చే ప్రవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు వినోద్ కుమార్‌ను కోరారు.

ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో వలస కార్మిక సంఘాల నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, మంద భీం రెడ్డి, ఏముల రమేష్, జంగం బాలకిషన్, జనగామ శ్రీనివాస్,  కుంట దశాగౌడ్, గంగుల మురళీధర్ రెడ్డ, తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

రంగుల హరివిల్లుగా మారిన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఒగ్గు కళాకారులు

మినీ డెయిరీ పథకాన్ని విజయవంతం చేద్దాం 

సాగు చ‌ట్టాలపై సుప్రీం స్టే.. చ‌ర్చ‌ల కోసం క‌మిటీ logo