బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 18:18:38

మల్యాలలో పాల్ టెక్నిక్ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తా

మల్యాలలో  పాల్ టెక్నిక్ కాలేజీ  నిర్మాణానికి కృషి చేస్తా

మహబూబాబాద్ : మల్యాలలో  పాల్ టెక్నిక్  కాలేజీ నిర్మించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని మల్యాలలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మల్యాలలో కృషి విజ్ఞాన కేంద్రం నిర్మించడం ఎంతో గర్వకారణమన్నారు. అంతేకాకుండా  ఇది ఒక దేవాలయంగా పరిగణించాలి అన్నారు. దీనికి అనుబంధంగా పాల్ టెక్నిక్ కాలేజీ అవసరమని తెలిపారు.

రైతుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రికి పాల్ టెక్నిక్  కళాశాల ఆవశ్యకతను వివరిస్తామన్నారు. కరోనాతో రైతులు పండించిన పంటను విక్రయించే సమయంలో ఇబ్బందులు రావొద్దనే   ఉద్దేశంతో రూ.30 వేల కోట్లు అప్పు చేసి ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేసినట్లు వివరించారు. అదేవిధంగా రైతుబంధుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర బడ్జెట్లో ఏడు వేల కోట్లు కేటాయించి 24 గంటల్లో 54 లక్షల మంది రైతులకు నేరుగా వారి ఖాతాలో జమ చేశామన్నారు. రైతు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చి రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని వెల్లడించారు.

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్  నీరు రాకపోయినా కాళేశ్వరం నుంచి  గోదావరి జలాలను మిడ్ మానేరు, లోయర్ మానేరు లకు తరలించి ఎస్సారెస్పీ కాలువల ద్వారా జిల్లాలో చెరువులను నింపి రైతులకు నీరందించామని పేర్కొన్నారు. అలాగే రైతు వేదికలకు రూ. 575 కోట్లు కేటాయించామని 2, 600 రైతు వేదికలను నిర్మిస్తున్నామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మహబూబా బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్  వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి రెడ్డి  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.logo