మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 10:04:49

కరోనాకు మందు మన మనోధైర్య‌మే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

కరోనాకు మందు మన మనోధైర్య‌మే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గాం : క‌రోనాకు మంచి మందు మ‌న మ‌నోధైర్య‌మే అని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కరోనా బాధితులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్కారు దవాఖానలో ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకుంటూ మ‌నోధైర్యంతో కరోనాను జయిద్దామ‌న్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం ప‌ట్టింద‌న్నారు. రోజు రోజుకు కరోనా తగ్గుతుండటం శుభ పరిణామం అన్నారు. కరోనాకు నిజమైన మందు మన మనోధైర్యమేన‌ని ఆ ధైర్యం ఇవ్వడం కోసమే తాను ప్రతి రోజూ బాధితుల‌తో మాట్లాడుతున్న‌ట్లు తెలిపారు. 


logo