గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 14:04:20

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్‌

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల :  జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో పలు అభివృద్ది పనులను  పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సెంట్రల్‌ లైటింగ్‌, పరిపాలన భవనం, కార్మికుల భోజశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. దేశంలో నే అతి పెద్ద కాకతీయ టెక్స్‌టైల్స్‌  పార్క్‌ వరంగల్,  సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.నేతన్నలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు.  

చేనేతకు 50 శాతం సబ్సీడి ఇస్తున్నామని,ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ వారి కోసం పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. రూ.14.50 కోట్ల తో టెక్స్ టైల్ పార్కు లో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.కరోనా నేపథ్యంలో కార్మికులకు అండగా ఉంటామన్నారు. కంపెనీల యజమానులు కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. చేనేతల  కార్మికులకు ప్రభుత్వ పరంగా చేయుతను అందిస్తామన్నారు. కేంద్రం సాయం కోరుతూ  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియ జేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.


logo