గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 02:34:01

బడ్జెట్‌లో మూడోవంతు రైతు కోసమే

బడ్జెట్‌లో మూడోవంతు రైతు కోసమే

  • రైతు సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌
  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు

నారాయణఖేడ్‌/పెద్దశంకరంపేట: బడ్జెట్‌లో మూడోవంతు నిధులను రైతు ల కోసం వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట తిర్మలాపురం శివారులో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయా కార్యక్ర మాల్లో మంత్రి మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌, పిప్రిలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఇండ్లను తలపించే రీతిలో ఉన్నాయని అభినందించారు. సీఎం కేసీఆర్‌ అహర్నిషలు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నా రని చెప్పారు. త్వరలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, క్విం టాల్‌కు రూ.6 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. వచ్చే మార్చి నుంచి స్థలమున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందజేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.


logo