బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 21:26:49

భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి రోకలిబండతో భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన చాపల మడుగు మురళి ఈ రోజు(మంగళవారం) మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య రాణి(20) తో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మురళి రోకలి బండతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో రాణి తీవ్ర రక్త స్రావమై మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ ఐ తిరుపతి తెలిపారు.


logo