శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 20:29:34

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త, కుమారుడు మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త, కుమారుడు మృతి

పెద్దపల్లి : సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో  పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాకు రాణాపూర్‌ గ్రామానికి చెందిన  భయపు విజయ (58)  అనారోగ్యానికి గురికావడంతో భర్త భయపు  రాజిరెడ్డి (62) తో కలిసి కరీంనగర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి  హుజురాబాద్‌లో ఉంటున్న కుమారుడు భయపు నరేందర్ రెడ్డి (39) వద్దకు వెళ్లి ముగ్గురు కలిసి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. సిద్దిపేట జిల్లా కేంద్ర శివారులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై ముగ్గురు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo