శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 01:19:54

ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు?

ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు?

  • l సోషల్‌మీడియా పోస్టుల్లో వీటిపై దృష్టిపెట్టాలి
  • l ఆ ఐదు ఆలోచించాకే మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేయాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సోషల్‌మీడియాలో వచ్చిన తప్పుడు మెసేజ్‌ను ఇతర గ్రూపులకు పంపాలనుకుంటున్నారా? ఓ వర్గం మనోభావాలు తీసేలా ఉన్న ఫొటోలు ఎవరికైనా షేర్‌ చేయాలనుకుంటున్నారా? రెచ్చగొట్టే ప్రసంగ వీడియోను ఫార్వర్డ్‌ చేస్తున్నారా? అయితే మీరు సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టే అంటున్నారు పోలీసులు. సోషల్‌మీడియాలో వస్తున్న మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేసేముందు.. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు (WHO, WHAT, WHERE, WHEN, WHY) అనే ఐదు డబ్ల్యూల గురించి ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. లేదంటే చట్టపరంగానూ ఇబ్బంది రావొచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

* ఎవరు ప్రచారం చేస్తున్నారు?: మనకు వచ్చిన సమాచారం సరైందేనా? దీన్ని ఎవరు పంపారు? ఆ ప్రచారం చట్టబద్ధమైనదేనా అని సరిచూసుకోవాలి. 

* ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు?: అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో కొందరు కొన్ని రకాల వార్తలను వ్యాప్తి చేస్తుంటారు. ఆ సమాచారంతో ఎంతమేర ఉపయోగం ఉన్నది? అనే విషయం గమనించాలి.

* ఎక్కడ చెక్‌ చేసుకోవాలి?: ఏదైనా సమాచారం.. వార్త , ఫొటో మీకు సోషల్‌మీడియాలో వచ్చినప్పుడు ఎలా దాన్ని నిర్ధారించుకోవాలో ఆలోచించాలి. https://factche ck.telangana.gov.in లేదా factly.in లో ఆ సమాచారం సరైనదేనా అని సరిచూసుకోవచ్చు. 

* తప్పుడు సమాచారం ఏమిటి?: ఫేక్‌ న్యూస్‌, తప్పుడు ప్రకటనలు, ఇతర మోసపూరిత ఆలోచనతో మన వ్యక్తిగత వివరాలు కోరుతున్నట్టుగా ఉంటాయి. వెంటనే అప్రమత్తం కావాలి. అది అసత్యమని గుర్తించాలి.

* ఎప్పుడు ఫార్వర్డ్‌ చేయాలి?: వైరల్‌ అవుతూ మీకు చేరిన ఫొటో, వీడియోను రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్‌ చేయడం ఉత్తమం.


logo