శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 18:44:16

వ‌రంగ‌ల్‌కు వ‌ర‌ద‌సాయం ఎందుకివ్వ‌లేదు : మంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్‌కు వ‌ర‌ద‌సాయం ఎందుకివ్వ‌లేదు : మంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగల్ : ఇత‌ర రాష్ట్రాల‌కు ఇచ్చిన వ‌ర‌ద సాహాయం వ‌రంగ‌ల్‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బీజేపీని ప్ర‌శ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కౌంట‌ర్ స‌వాల్ విసిరారు. కేంద్ర నిధులు ఏం చేశామో న‌యా పైసాతో స‌హా లెక్క‌లు చెప్పేందుకు తాము సిద్ధ‌మ‌ని మ‌రి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్ప‌గ‌ల‌దా అన్నారు. చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మ‌న్నారు. ఆలయాలను అడ్డాగా చేసుకొని ప్రజలను మోసం చేయకండ‌ని హిత‌వు ప‌లికారు.  

సంక్షేమం, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ ఆస్పత్రి సేవలకు తెలంగాణ‌ నెంబర్ వన్ అని మీరే అవార్డులు ఇచ్చిన సంగ‌తి మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. దుబ్బాక ప్రజలు, హైదరాబాద్ ప్రజలను మోసం చేసినట్లు వరంగల్ ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించేది లేద‌న్నారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోని, హుందాగా వ్యవహరించాల‌న్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ఛాలెంజ్‌లు అన్నారు.