సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 21:41:39

కళ్లకు కాటుక ఎందుకు పెట్టుకోవాలి..? పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి.!

కళ్లకు కాటుక ఎందుకు పెట్టుకోవాలి..? పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి.!

హైదరాబాద్ : అమ్మాయి మొహం చూడగానే మొదటగా కనిపించేవి కళ్లు. అందమైన ఆకర్షించే కళ్లు కావాలంటే కాటుక ఉండాల్సిందే. కాటుక కళ్లు అందరినీ ఆకర్షిస్తాయట, ఏవేవో మాట్లాడతాయట. అందుకేనేమో కాటుక కళ్ల మీద చాలా కవితలు, పాటలు వచ్చాయి. ఇంతకీ కళ్లకు కాటుక ఎందుకు పెట్టుకోవాలి..?, ఎలా పెట్టుకుంటే మంచిది..? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా. అయితే దానికి సమాధానం మా దగ్గర ఉంది. అదేంటంటే..

 1.కాటుకను ప్రమిద, ఆముదం, దూది, రాగిపాత్ర, గంధం, కర్పూరం లాంటి పదార్థాలతో తయారుచేస్తాయి. ఇవి కళ్లకు మంచి ఔషధాలుగా పనిచేస్తాయి.

2. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. 

3. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది.

4. కళ్లు ఎర్రబడటం, మంట రావటం లాంటివి కాటుకతో తగ్గుతాయి.

5. ఎంత చిన్న కళ్లైనా.. రవ్వంత కాటుక దిద్తితే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయట

6. మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు.

2. ఎలా పెట్టుకుంటే మంచిది..?

కాటుక పెట్టుకోవడం వల్ల కంటికి మంచిదని తెలిసింది కాదా. కానీ ఇది పెట్టుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకుంటే.. అందమైన, ఆకర్షనీయమైన కళ్లు మీ సొంతం అవుతాయి..

1. కాటుక పెట్టుకునే ముందు కళ్లపై తడి లేకుండా చూసుకోవాలి.

2. తర్వాత మెత్తని బట్టతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. 

3. కనురెప్పల కొనభాగంలో కాకుండా కనురెప్పల మధ్యనే కాటుక పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అది స్ప్రెడ్ అవకుండా ఉంటుంది. 

4. కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐషాడో బేస్‌గా వేసుకుంటే కాటుక చెదిరిపోకుండా ఉంటుంది. 

5. కాటుక పెట్టకోవడం వల్ల కొందరికి దురద పెట్టడం, కళ్లు మంటపుట్టడం జరుగుతుంటాయి వెంటనే ఆపేయాలి.