గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 19:07:51

యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోంది : మంత్రి పువ్వాడ

యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోంది : మంత్రి పువ్వాడ

ఖ‌మ్మం : టీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాల‌ను యావ‌త్ దేశ‌మే అనుస‌రిస్తుంద‌ని రాష్ర్ట ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ అన్నారు. ఖ‌మ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం చిన్నమండవ గ్రామం నుండి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో 80 కుటుంబాలు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఖమ్మం టీఆర్ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పాల్గొని వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టం తెచ్చారన్నారు. ఏళ్ల తరబడి దోపిడీకి గురైతున్న పేదలను, రైతులను శాశ్వతంగా విముక్తుల‌ను చేసే క్రమంలో అనేక చ‌ట్టాలు, సంస్కరణలు తీసుకొచ్చి వారికి ప్రయోజనకరంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని ఇది రైతురాజ్యం.. రైతు ప్రభుత్వం అని తెలిపారు. కరోనా సమయంలోనూ రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేశార‌న్నారు. 

పార్టీలో చేరిన వారిలో నాగులవంచ పిఎసిఎస్ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్ గౌడ్, మాజీ సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్ గుండ్ల జయమ్మ త‌దిత‌రులు ఉన్నారు.  ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, చింతకాని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పిటిసి పర్చగాని తిరుపతి కిషోర్, వైస్ ఎంపీపీ గురుజాల హనుమంతరావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, కమిటీ సభ్యులు మంకెన రమేష్, మండల పార్టీ కార్యదర్శి వెముల నరసయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, వంకాయలపాటి లచ్చయ్య, కొల్లి బాబు, ఆళ్ళ పానకలరావు, మరిది లక్ష్మీనారాయణ,శెట్టిపల్లి పాండురంగారావు, పార్చగాని వీరబాబు, రాచకొండ అంజయ్య తదితర పార్టీ నాయకులు ఉన్నారు.logo