గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 02:08:23

లాకో మరీజొంకా దవా!

లాకో మరీజొంకా దవా!
  • ప్రకృతి అందాలకు నెలవుగా అనంతగిరి కొండలు
  • ఒకప్పుడు ఇక్కడే క్షయ వ్యాధిగ్రస్థులకు సేవలు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వికారాబాద్‌ కా హవా.. లాకో మరీజొంకా దవా.. వికారాబాద్‌ గాలి లక్షల మంది రోగులకు ఔషధం లాంటిదని అనాదిగా ప్రచారంలో ఉన్నది. వికారాబాద్‌ పట్టణానికి సమీపంలోని అనంతగిరి అడవులు స్వచ్ఛమైన గాలికి, పచ్చని పర్యావరణానికి ప్రసిద్ధి. ఈ కొండల్లో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. రమణీయ వాతావరణంతో అలరారే ఈ ప్రాంతంలో క్వారంటైన్‌ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. రాజధాని హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు, గుట్టలు, లోయలు, పచ్చటి చెట్లతో పరుచుకొని ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా కూడా పిలుచుకొంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అనంతగిరి అటవీ ప్రాంతంలో క్వారంటైన్‌ కేంద్రం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చిన వారిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా అనంతగిరిలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించనున్నారు. పరీక్షలు జరిపిన తర్వాత పాజిటివ్‌గా నివేదిక వచ్చినవారిని గాంధీ దవాఖానకు తరలించి చికిత్స ఇస్తారు. అనంతగిరి అడవులతోపాటు హైదరాబాద్‌ శివారులోని దూలపల్లి అటవీ అకాడమీలో అందుబాటులో ఉన్న ప్రత్యేక గదులను ఐసోలేషన్‌ వార్డులుగా వినియోగించేందుకు అధికారులు యోచిస్తున్నారు. 

హరిత హోటల్‌ను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో బృందం హరిత హోటల్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బృందం పరిశీలించి, అక్కడ చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.తాండూరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని కూడా సందర్శించారు.


logo