మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 20:57:15

కరోనాపై వాట్సాప్‌: గ్రూప్‌ ఆడ్మిన్‌పై కేసు నమోదు..

కరోనాపై వాట్సాప్‌: గ్రూప్‌ ఆడ్మిన్‌పై కేసు నమోదు..

మణుగూరు సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాన్ని వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌, గ్రూప్‌ల్లో సర్క్యూలెట్‌ చేసిన వారిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మణుగూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌పై కొందరు వాట్సాప్‌ గ్రూప్‌లో అసత్య ప్రచారం చేశారు. డాక్టర్‌ ఫిర్యాదు మేరకు పోస్టు చేసిన ముగ్గురిపైన, గ్రూప్ అడ్మిన్ పైన కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ షుకూర్‌ తెలిపారు. కరోనాపై భయాందోళనలు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo
>>>>>>