మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:18:15

జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుదాం: ఎంఐఎం

జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుదాం: ఎంఐఎం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీహార్‌ ఎన్నికల్లో గెలుపే స్ఫూర్తిగా జాతీయ రాజకీయా ల్లో సత్తా చాటుదామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చా రు. బీహార్‌ ఎన్నికలలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం అసదుద్దీన్‌తో భేటీ అయ్యారు. ఎంఐఎం పార్టీ దళిత, మైనార్టీ, బీసీ వర్గాల గొంతుకగా మారి జాతీయ రాజకీయా ల్లో ఉనికిని చాటుకున్నదని పేర్కొన్నారు. మతవాద పార్టీలకు గుణపాఠం చెబుతూనే  బహుజన సంక్షేమం కోసం పోరాడుతున్న భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. బీహార్‌ ప్రజలు తమకు పూర్తిగా అండగా నిలిచారని వెల్లడించారు. అనంతరం వరద బాధిత కుటుంబాలకు సాలార్‌-ఎ-మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ వరద సాయాన్ని అందించారు.