ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 19:32:19

ఒక పౌరునిగా కరోనా నివారణకు నేను ఏం చేస్తానంటే..

ఒక పౌరునిగా కరోనా నివారణకు నేను ఏం చేస్తానంటే..

 • ఒక పౌరునిగా నేను కరోనా వ్యాప్తి నివారణకు నావంతుగా ఈ దిగువ స్వీయ నియంత్రణలు పాటిస్తాను. 
 • ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణం చేయను.
 • విందులు, వినోదాలు, సమావేశాలకు వెళ్లను.
 • సినిమాలు, హోటళ్ళకు వెళ్లను. బయటి నుంచి ఆహారం తెప్పించుకోను. 
 • జిమ్‌కు, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లను.
 • ఇతరులను కలిసినప్పుడు దూరం నుంచే అభివాదం చేస్తాను. కరచాలనాలకు దూరంగా ఉంటాను.
 • ముకాన్ని ముట్టుకునే విషయంలో శ్రద్ధగా ఉంటాను.
 • బయటికి వెళ్లివచ్చినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా వచ్చివెళ్లినప్పుడు, వీలైనన్ని సార్లు చేతులను సబ్బుతో కనీసం 20 సెక్నల కు తక్కువ కాకుండా కడుక్కుంటాను. వంటి చేసేముందు, బోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కుంటాను.
 • లిఫ్ట్ బటన్లు, డోర్ హేండిల్స్ మొ. ముట్టుకోవాల్సి వస్తే టిష్యూపేపరును వినియోగిస్తాను.
 • కిరాణా సామాన్ల వంటివి తెచ్చుకోవడం వంటి అత్యవసరమైన పనులకు మాత్రమే బయటికి వెళతాను. ఒకరకంగా చెప్పాలంటే నన్ను నేను నిర్బంధానికి గురిచేసుకుంటాను. ఇవన్నీ నా సంక్షేమం కోసం, నా తోటి పౌరుల సంక్షేమం కోసం చేస్తాను.
 • ఇదంతా అతిస్పందన కాదు.. కేవలం జాగ్రత్త మాత్రమే
logo